తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలోని పంట పోలాలను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు పరిశీలించారు.
అనంతరం మంత్రి హారీష్ రావు రైతులతో మాట్లాడుతూ అధైర్య పడొద్దు రైతన్నకు అండగా నేనుంటా అని అన్నారు.దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టపోయిన రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి .రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, త్వరలోనే రైతులకు నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.