నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. 22 ఏండ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.
‘రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్. 22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు.