ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ సేనకు ఇది చివరి మ్యాచ్ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పరుగున మైదానంలోకి వచ్చాడు.
ధోనీ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. అదీ తాను వేసుకున్న అంగిపై..దీంతో ఆశ్చర్యానికి లోనైన ధోనీ.. లిటిల్ మాస్టర్‌ను ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అతను వేసుకున్న అంగిపై తన సంతకం చేశారు. అనంతరం ట్విట్టర్ వేదిక స్పందించిన గవాస్కర్ మిగిలిన మ్యాచ్‌లకు దయచేసి తనకు కొత్త పింక్ షెర్ట్ ఇవ్వండి అంటూ రాసుకొచ్చారు.
𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛
A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg
— IndianPremierLeague (@IPL) May 14, 2023