కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని డిపి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు.
ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించి.. చేపట్టవలసిన పనులను తెలుసుకున్నారు. కాగా పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి కాలనీ వాసులు తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలిచ్చారు.
వాటి వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఈ పాపమ్మ, డిజిఎం అప్పల నాయుడు, మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు వెంకట స్వామి, యూసుఫ్, మన్నన్, అనిల్, ప్రభాకర్, పద్మజ రెడ్డి, విష్ణు, శేఖర్, కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్, సుధీర్ రెడ్డి, రంగస్వామి, ఖాజా, శ్రీనివాస్, పృధ్వీ, వీరేశం గౌడ్, వాసు, లలిత్ గౌడ్, శ్రీను, లలిత్ కుమార్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.