ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా ఈ సీజన్ లో తమ జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన విరాట్ కోహ్లిని చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసినా జట్టు గట్టెక్కలేకపోయింది. దీంతో ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకున్న కోహ్లి ఆశలు సమాధి అయ్యాయి.
ఈ సీజన్లో కోహ్లి 14 మ్యాచుల్లో 53 సగటుతో 639 రన్స్ చేశాడు. నిన్న ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి దిగాలుగా కూర్చున్న ఫొటో హర్ట్ చేస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.