తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సత్తుపల్లిలో లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్ నందు సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది , ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. 10 యేండ్ల కాలంలో రాష్ట్రంలో, ఆయా గ్రామాలలో సంధించిన అభివుద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉత్సవాలను నిర్వహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు పిలుపునిచ్చారు.