సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పించి ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ అధ్వర్యంలో డివిజన్ కు చెందిన ఆశా వర్కర్ లకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆశా వర్కర్లు విధులు నిర్వరిస్తున్నారని వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్పొరేటర్ లు సామల హేమ, కంది శైలజ తదితరులు, అధికారులు పాల్గొన్నారు.
