తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగు పెట్టిన శుభ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం లోని పాటీ గ్రామ పరిధిలో గల SVR గార్డెన్స్ లో సంక్షేమ సంబురాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
* ఈ సందర్బంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వములో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరణ, వాటి వలన ప్రజలకు కలుగుతున్న మేలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందుకుంటుందని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు తెలియజేయడం జరిగింది.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ద్వారా ముగ్గురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు,111వ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు,నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, జెడ్.పి.టి.సి లు, ఎం.పిపిలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎం.పి.టి.సి.లు, గ్రామ సర్పంచులు,ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు, పాల్గొనడం జరిగింది