తెలంగాణ రాష్ట్ర 9 ఏండ్ల సంక్షేమ సుఖ తెలంగాణ 10 ఏండ్లలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఈరోజు బోథ్ నియోజకవర్గంలోని నూతన మండలమైన భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 27 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ. 1,00,116/- చొప్పున 27,03,132 రూపాయలను కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. అనంతరం గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఈయొక్క భీంపూర్ గ్రామము మాములు పల్లెటూరు ఉండేదని నేడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గిరిజన గ్రామమైన భీంపూర్ గ్రామాన్ని మండలంగా మార్చి నేడు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాము..
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్ల పరిపాలన వ్యవస్థ గురించి వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిది ఏండ్లలో అందించిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి గారు, మండల కన్వీనర్ నాగయ్య, స్థానిక జడ్పీటీసీ, ఎంపిపి, సర్పంచ్ గార్లతో పాటు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.