Home / SLIDER / మంచి నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

మంచి నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మంచి నీటి దినోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గారు హాజరయ్యారు. మొదటగా గుడిహత్నూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి జాదవ్ సునీత రమేష్ గారి ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండల కేంద్రంలోస్థానిక ప్రభుత్వ ఆసుపత్రి (వాటర్ ట్యాంక్ ) దగ్గర పూజ కార్యక్రమములో పాల్గోని అక్కడి నుండి గ్రామ పంచాయతి కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముందుగా మిషన్ భగీరథ నీటిపై నిర్వహించిన అవగాహన సదస్సు ల్యాబ్ లో చేసిన టెస్టులను ప్రజలతో కలిసి వీక్షించారు. అదేవిధంగా గుడిహత్నూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 4 మందికి మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు అయిన రూ. 1,32,000/- లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గారు మాట్లాడుతూ మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతుంది అని పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతున్న భగీరధుడు మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అని కొనియాడారు .

సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానం లో ఉంచారన్నారు.ఇట్టి సందర్భంగా నియోజక వర్గ ప్రజలకు మంచి నీటి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ ఈ గారు గుడిహత్నూర్ మండల కన్వినర్ కరాడ్ బ్రహ్మానంద్. స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత గారు.. కోప్షన్ సభ్యులు జమీర్ గారు. ఎంపీటీసీ షాగీర్ ఖాన్. Pacs డైరక్టర్ ఫడ్ దిలీప్. సీతగొంది ఉపసర్పంచ్ సంతోష్ గౌడ్. మాధవ్. సలీం ఖాన్. వినోద్ కొల్లూరి.. రాహుల్. నితేష్ ప్రశాంత్.. అధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat