అలంపూర్ నియోజకవర్గం మానవ పాడు మండలం పరిధిలోని మద్దూరు గ్రామంలో 17 లక్షల రూపాయలతో మరియు, అమర వాయి గ్రామంలో 9.14 లక్షల రూపాయలతో మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత గారు.మన ఊరు మన బడి పాఠశాల భవనం ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో గత ప్రభుత్వాలు విద్యకు సరైన ప్రాధాన్యత కల్పించ లేకపోయారు .ఈ ప్రాంతం నుండి విద్యార్థులు కర్నూలు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెళ్లి విద్యను అభ్యసించేవారు నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారు నేతృతంలో విద్యారంగానికి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ 119 మైనార్టీ గురుకులాలను స్థాపించి, కార్పొరేట్ స్థాయి లో వసతులతో, నాణ్యమైన విద్యను పౌష్టికాహారం తో, కేజీ టు పీజీ ఉచిత విద్య అందించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు అధికారులు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..