తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని విద్యాదినోత్సవ సందర్భంగా తల్లాడ మండలం,రెడ్డిగూడెం మల్లారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన తరగతి గదులను, గ్రంధాలయాలను ప్రారంభించి, విద్యాదినోత్సవ సందర్భంగా నేటినుండి ప్రారంభమైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాటు రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు చిన్నారులకు అందజేసి ప్రారంభించారు.
విద్యా సంవత్సరం గాను విద్యాశాఖ నుండి విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటుచేసిన నూతన ఏకరూప దుస్తులను, నూతన పాఠ్యపుస్తకాలను అందజేసి పాఠశాలలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు,సర్పంచ్ లు దుగ్గిదేవర. సామ్రాజ్యం, బద్ధం. నిర్మల,రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర.వెంకటలాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి. భద్రరాజు,M. D. O రవీంద్ర రెడ్డి, M.E.O దామోదర ప్రసాద్, S. I పి. సురేష్,జోనల్ చైర్మన్స్ దగ్గుల. శ్రీనివాసరెడ్డి, బద్ధం. కోటిరెడ్డి,దిరిసాల. దాసురావు,మాజీ సర్పంచ్ మువ్వా. మురళి,ఉద్యమ నాయకులు బొడ్డు. వెంకటేశ్వర రావు, సత్తుపల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కోడూరి. వీరకృష్ణ,పట్టణ అధ్యక్షులు జి. వి. ఆర్,మాజీ ఎంపీపీ కాంపెల్లి. రాము,సోసైటీ డైరెక్టర్ కటికి. నరసింహారావు,సోసైటీ వైస్ చైర్మన్ రేగళ్ల. సత్యం, బి. ఆర్. యస్ గ్రామ నాయకులు తూట రి. వెంకటి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు