నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు.
మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 18లక్షల విలువగల 36 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. బారాస ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.