Home / SLIDER / పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు.. రేవంత్‌తో కీలక భేటీ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు.. రేవంత్‌తో కీలక భేటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపార్టీలో చేరుతున్నారనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పొంగులేటి ఎపిసోడ్‌ ఉత్కంఠతకు ఇవాళ్టితో తెరపడనుంది. పొంగులేటి కాంగ్రెస్‌లో ఎంట్రీకి దాదాపు ఖాయమైంది. హస్తంపార్టీలో చేరేందుకు అటు పొంగులేటి సైతం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులతో కలిసి అధికారికంగా ప్రకటించనున్నారు పొంగులేటి. దీనికోసం ఇప్పటికే ముఖ్య అనుచరులతో మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్‌కు రావాలంటూ అనుచరులకు ఫోన్లు చేశారు. అనౌన్స్‌మెంట్ తర్వాత నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున తన అనుచరులతో కలిసి పొంగులేటి ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇక ఇవాళ పొంగులేటి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జూపల్లి, పొంగులేటితో సమావేశం అవుతారు రేవంత్‌ రెడ్డి. పార్టీలో చేరాల్సిందిగా ఇద్దరి నేతలను రేవంత్ ఆహ్వానించనున్నారు. ఇదే క్రమంలో పొంగులేటితో పాటు వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా రేవంత్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. రేవంత్‌తో భేటీ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. యూస్ టూర్‌ను ముగించుకుని 22న ఢిల్లీకి చేరుకోనున్నారు. రాహుల్ ఢిల్లీకి రాగానే తమ అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు పొంగులేటి, జూపల్లి వెళ్లి.. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు.

ముందుగా బీఆర్‌ఎస్‌ పట్ల అసంతృప్తిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆయనతో జత కలిశారు. జూపల్లి జతకలిశాక.. తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఒకానొక దశలో స్వంతగా పార్టీని ఏర్పాటు చేస్తారనే టాక్ కూడా వినిపించింది. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి ఖమ్మం, మహబూబ్ నగర్ లలో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా వారి ఆత్మీయులతో సుధీర్ఘంగా చర్చించారు….

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat