దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో సహా, ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యంతరకరమని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.
కాగా ఇవాళ ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి కేంద్రం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరావును ఆహ్వానించింది. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తో పాటు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, ఇలా చాలా మంది హాజరయ్యారు. కానీ లక్ష్మీపార్వతి విషయంలో మాత్రం ఎందుకనో కేంద్రం కినుక వహించింది. దీనికి పురందేశ్వరే కారణమని ఆమె మండిపడుతున్నారు. మీ ఇంట్లో కార్యక్రమం అయితే నన్ను పిలవద్దు…నన్ను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారా లేదా….ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెప్పాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తమ వివాహం పై అన్ని పత్రికలు రాసాయని, ఎన్ని సార్లు తనను అవమానిస్తారని ఆమె నిలదీశారు. తాను ఎన్టీఆర్ భార్య అని బోర్డ్ కట్టుకుని తిరగలా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తనను ఎన్టీఆర్ ఇల్లిగల్ గా పెట్టుకున్నారా అని కూడా లక్ష్మీపార్వతి అడిగారు. ఎన్నాళ్లు ఈ అవమానాలన్నారు. ఏదో ఒక రోజు పురందేశ్వరి తన కన్నా ఎక్కువ అవమానాలకు గురి అవుతుందన్నారు. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే వరకు వైసీపీ తరపున ప్రచారం చేస్తానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.
ఇక కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనుకుంటే పురంధరేశ్వరి, చంద్రబాబు కలిసి అడ్డుకున్నారని మండిపడ్డారు….ఎన్టీఆర్ సతీమణిగా తాను భారతరత్న అవార్డు స్వీకరించాల్సి వస్తుందనే కారణంతోనే ఇన్నేళ్లుగా ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు ప్రారంభం అయ్యాయని అందుకే చంద్రబాబు పురందేశ్వరి మళ్లీ ఏకం అయ్యారని అన్నారు. పురంధేశ్వరీ బీజేపీలో ఉంటూ టీడీపీకి పని చేయడం ఏంటని నిలదీశారు.. . పురంధేశ్వరీ చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తోందని, టీడీపీ ఏజెంట్ గా పని చేస్తూ ఏపీలో బీజేపీని పూర్తి నాశనం చేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇక ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్ కూడా రాకపోవడంపై లక్ష్మీ పార్వతి స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కు అసలు ఆహ్వానం ఇచ్చారో లేదో తెలియదు..జూ. ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబును, జూ. ఎన్టీఆర్ ను కలపాలనే ప్రయత్నం చేసింది..ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూ. ఎన్టీఆర్ కు హాజరయ్యేవారు. ప్రైవేట్ ఫంక్షన్ కనుక హాజరు కాలేదు..పురంధేశ్వరీ కుట్రను బీజేపీ పెద్దలు గ్రహించాలని లక్ష్మీ పార్వతి కోరారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను పురంధేశ్వరీ చదువుతోంది…సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమారులు అమాయకులు..పురంధేశ్వరీ, భువనేశ్వరీలే దుర్మార్గులు అని మండిపడ్డారు.
అసలు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటుకు ఇంటర్నల్ గా పురంధేశ్వరీ ప్రధాన కారకురాలు అని ఆరోపించారు …రాజకీయాల్లోకి వద్దు అని అన్నాడని తండ్రి ఎన్టీఆర్ పై పురంధేశ్వరీ కుట్ర చేసిందని, కాంగ్రెస్ పార్టీలో చేరి…కేంద్రమంత్రిగా ఉండి అవినీతి చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఇక చంద్రబాబు, పురంధేశ్వరీ, బాలయ్యలను వదిలిపెట్టను..అందరిని బయటకు లాగుతా…పురంధేశ్వరీ తిరిగిన ప్రతీ నియోజకవర్గంలో తిరుగుతా…ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తా..వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తా..వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా అని లక్ష్మీ పార్వతి ప్రతిన పూనారు. మొత్తంగా ఎన్టీఆర్ స్మారక చిహ్నం విడుదల కార్యక్రమం కాస్తా టీడీపీ కార్యక్రమంలా జరగడం తీవ్ర వివాదంగా మారుతోంది.