Home / ANDHRAPRADESH / నిన్నటి వరకు కిలో రూ. 200 ..ఇప్పుడు రూ. 2 /- టమాటా నేర్పిన గుణపాఠం ఇదే..!

నిన్నటి వరకు కిలో రూ. 200 ..ఇప్పుడు రూ. 2 /- టమాటా నేర్పిన గుణపాఠం ఇదే..!

నిన్న మొన్నటి వరకు 200 దాటి సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించిన టమాటా…ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది..దేశవ్యాప్తంగా నెల రోజుల క్రితం వరకు టమాటా ధర ఆకాశాన్ని తాకింది…కిలో టమాటా ఏకంగా 200 రూపాయలు దాటింది..అసలు టమాటా లేకుండా ఏ కర్రీ ఉండదు…అలాంటిది టమాటా ధర కొండెక్కడంతో సామాన్యులు నానా అగచాట్లు పడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..టమాటా బంగారం కంటే ప్రియమైపోయిందనే చెప్పాలి..టమాటా ట్రేల దొంగతనాలు మొదలైపోయాయి..టమాటాలు అమ్మి నెల రోజుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు అయినట్లు ఎన్నో కథనాలు వార్త పత్రికలు, మీడియా ఛానళ్లలో ప్రసారం అయ్యాయి..ఇక టమాటా ధరపై సోషల్ మీడియాలో పేలిన జోక్స్, మీమ్స్ ట్రెండింగ్ లోకి వెళ్లాయి..అయితే ఇప్పుడు ఒక్కసారిగా టమాటా ధర పడిపోయింది..కిలోకి 2 రూపాయల కూడా రావడం లేదు. 20 కేజీల ట్రేకి మార్కెట్‌లో 40 రూపాయలు రావడం గగనం అయిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొందరైతే రోడ్డుపైనే టమాటాలు పారబోసి నిరసన తెలిపారు. డిమాండ్‌ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌కు వచ్చిన సరుకంతా కొనేవారు లేక కుళ్లిపోయే పరిస్థితి ఉంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు చుక్కల్ని చూపించిన టమాటా.. ఇప్పుడు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది..టమాటా ధరలు తగ్గడంతో సామాన్యులు ఖుషీ అవుతున్నా..రైతన్నల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. రిటైల్ మార్కెట్లలో కిలో టమాటా 20-30 రూపాయలు పలుకుతోంది. కానీ, పాపం రైతు పంటను అమ్ముకునే రైతు బజార్లలో మాత్రం దారుణమైన ధరలు ఉంటున్నాయి. ఆ రేట్లతో టమాటా రైతులకు అస్సలు గిట్టుబాటు అవ్వడం లేదు.కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా కేవలం 3 లేదా 2 రూపాయలు మాత్రమే పలుకుతోంది. 100 కేజీల టమాటాకు కేవలం 200 రూపాయలు మాత్రమే వస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.. పంటకు గిట్టుబాటు ధర దేవుడెరుగు…కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. కొందరు రైతులు అయితే రవాణా ఖర్చులు దండగ అని భావించి పండించిన టమాటాను రోడ్లు వెంట పారబోస్తున్నారు. నెల రోజుల క్రితం మిడిల్ క్లాస్ జనాలు కొనేందుకు కూడా అందకుండా పోయిన టమాటా.. ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి..అందుకే టమాటా నేర్పిన గుణపాఠం ఏంటంటే…జీవితం చాలా చిన్నది..ఇప్పుడు కోట్లు ఉన్నాయని ఎగిరెగిరి పడితే..ఆ తర్వాత కొన్నాళ్లకే బిచ్చగాడివి అవుతావు…ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోతుందో తెలియదు..బతికినంత కాలం మంచితనంతో ..నలుగురికి సాయం చేస్తూ…ఉన్నంతలో బతకాలని, లేకుంటే బతుకు కుళ్లిపోయిన టమాటా అయిపోతుంది జాగ్రత్త..!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat