ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు.
దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు సంఘటన ప్రదేశానికి చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లా చెదురు చేశారు.
పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదానికి దిగిన జనసేన నేతలను అరెస్టు చేశారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ పరిస్థితిని సమీక్షించారు.