టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారాలోకేష్. పదేపదే మమ్మల్నెవరూ పీకలేరు అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతారు.. , కేంద్ర దర్యాప్తు సంస్థలలో, న్యాయవ్యవస్థల్లో చంద్రబాబు తెలివిగా తన మనుష్యులను జొప్పించిన చంద్రబాబు..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు..అసలు అదేంటో తెలియదు..ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు మంచి చేయాలనుకున్న పనులలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి..ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయాల్లో కానీ హైకోర్టులలో రివర్స్ లో ప్రభుత్వానికి చివాట్లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంటుంది. తనపై మీ నాయన వైఎస్ఆర్ 20 కేసులు పెట్టినా ఏం పీకలేకపోయాడు..నువ్వెంత అంటూ గతంలో అసెంబ్లీలో చంద్రబాబు జగన్ పై రెచ్చిపోయాడు.. తనపై ఉన్న 27 కేసుల్లో ఇంత వరకు విచారణ ఎదుర్కొకుండా దాదాపు 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న లాబీయింగ్ కింగ్ చంద్రబాబు..
ఇప్పుడు తరం మారింది..వైఎస్ కొడుకు వచ్చాడు..బాబుకు సీన్ రివర్స్ అయింది..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్ లో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, ఇన్నాళ్లు చట్టాలను చుట్టంలా చేసుకుని, న్యాయం కళ్లుగప్పి.. దర్జాగా కాలెగరేస్తున్న చంద్రబాబును గల్లా పట్టి బొక్కలోకి వేయించిన ఘనత..ఏపీ సీఐడీ డీజీ సంజయ్ కే దక్కింది..అయితే ఇప్పుడు చంద్రబాబునే కాదు..గతంలో 2004 లో తన ఇంట్లో అర్థరాత్రి పూట ఏం జరిగిందో ఏమో కానీ నందమూరి బాలయ్య నిర్మాత బెల్లంకొండ సురేష్ పై తన రివ్వాలర్‌తో కాల్పులు జరిపాడు..ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బెల్లంకొండ సురేష్ చాలా కాలం ఆసుపత్రిలో చికిత్సపొందారు..హత్యాప్రయత్నం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు బాలయ్యను జైలుకు తరలించారు..
కాగా అప్పుడు బాలయ్యను జైలుకు పంపిన అధికారే…ఇప్పుడు చంద్రబాబును జైలుకు పంపాడు..ఆయనే ప్రస్తుత ఏపీ సీఐడీ డీజీ సంజయ్…1996 బ్యాచ్ ఐపీఎస్ క్యాడర్ అయిన సంజయ్ పలు హోదాల్లో పని చేశారు. 2004లో సంచలనం సృష్టించిన బెల్లంకొండ సురేష్ కాల్పుల కేసులో అప్పటి స్టార్ హీరో, నందమూరి బాలయ్యను అరెస్ట్ చేసి కటకటాలకు పంపిన సంజయ్ ఇప్పుడు స్కిల్ స్కామ్ లో చంద్రబాబును కూడా జైలుకు పంపడం విశేషం….అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీ వెళ్లి వైఎస్ఆర్ కాళ్లా వేళ్లా మీద పడితే..ఆయన దయతో క్రమంగా బాలయ్య మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని…ఆ కేసు నుంచి బయటపడ్డాడు..ఇప్పుడు చంద్రబాబు మాత్రం స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయాడు..మరి తనకు అలవాటైన రీతిలో వ్యవస్థలను మేనేజ్ చేసి. వేల కోట్లు వెదజల్లి…చట్టాన్ని, న్యాయాన్ని కొని..ఈ కేసు నుంచి బయటపడతాడా లేదా..దోషిగా జైలులో శిక్ష అనుభవిస్తాడా అనేది చూడాలి..మొత్తంగా అప్పుడు బాలయ్యని, ఇప్పుడు చంద్రబాబును జైలుకు పంపిన డైనమిక్ ఆఫీసర్ గా సీఐడీ డీజీ సంజయ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.