Breaking News
Home / ANDHRAPRADESH / చంద్రబాబు అరెస్ట్…101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న వ్యక్తి…!

చంద్రబాబు అరెస్ట్…101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న వ్యక్తి…!

ఏ జన్మలో చేసిన పాప ఫలితాలు ఆ జన్మలోనే అనుభవించక తప్పదని మన పురాణాల్లో చెప్పబడింది..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ 40 ఏళ్లలో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు..అధికారం కోసం..
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి…సీఎం కుర్చీతో సహా పార్టీని, ఆస్తులు లాక్కుని,.. మానసిక క్షోభకు గురి చేసి, చివరకు ఆయన చావుకు కారకుడైన అభినవ ఔరంగజేబు చంద్రబాబు..
బాబుకు తెలిసిందల్లా..అవసరానికి వాడుకోవడం…తీరా అవసరం తీరాక కరివేపాకులా తీసేయడం..తన స్వార్థం కోసం నమ్ముకున్నవారిని సైతం నట్టేలా ముంచే నయవంచకుడు..వైఎస్ ఆర్ ఇక లేరని తెలిసి.. తెలుగు రాష్ట్రాలలో ఎన్ని గుండెలు ఆగిపోయాయే మనందరికీ తెలిసిందే..ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం సాధించుకున్న మహానేత వైఎస్ఆర్.

కానీ చంద్రబాబుకు పేద ప్రజలంటే చిన్నచూపు..నరనరాన కుల అహంకారం జీర్ణించుకున్న చంద్రబాబు దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలను బహిరంగంగా గానే దూషించిన ఘటనలు కోకొల్లలు..అందుకే ప్రజల్లో ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ పై ప్రజల్లో పెద్దగా స్పందన రావడం లేదు..మా నిప్పును అరెస్ట్ చేశారంటూ పప్పుతో సహా పచ్చమీడియా మూడు రోజులుగా చావు డప్పు కొట్టినట్లు ఒకటే శోకాలు పెడుతోంది..కానీ సాధారణ ప్రజలు చాలా మంది చంద్రబాబు అరెస్ట్ పై పండుగ చేసుకుంటున్నారు. చంద్రబాబు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది బాధితులుగా మిగిలారు.. ఇప్పుడు పాపం పండి ఇన్నేళ్లు చంద్రబాబుకు జైల్లో చిప్పకూడు తినే రిస్థితి రావడంతో సామాన్యులు ముఖ్యంగా పేదలు పండుగ చేసుకుంటున్నారు.

తాజాగా చంద్రబాబు అరెస్ట్ ను ఓ వ్యక్తి పండుగ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో 101 కొబ్బరి కాయలు గుడిలో మొక్కును తీర్చుకున్నాడట. ఇతను గతంలోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే 101 కొబ్బరి కాయలు కొడతానని మొక్కు కున్నాడని తెలుస్తోంది. ఆ మొక్కులో భాగంగానే ఈ రోజు మన స్కామ్ స్టర్ చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంతో ఆ వ్యక్తి సంతోషంతో దేవుని గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి…ఇలా మొక్కు తీర్చుకున్నాడంట.. పైగా చంద్రబాబును అరెస్ట్ చేయించినందుకు గాను సీఎం వైఎస్ జగన్ కు థాంక్స్ అంటూ చెప్పాడు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా 101 కొబ్బరి కాయలు కొట్టిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino