జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు, బాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు..ఓ రకంగా వైసీపీ నేతల విమర్శల్లో అర్థం లేకపోలేదు అన్నట్లుగా జనసేన అధినేత రాజకీయం నడుస్తోంది. .జగన్ అవినీతిపరుడు అంటూ పదే పదే ఆవేశంతో ఊగిపోతూ రంకెలు వేసే పవన్ కల్యాణ్…అదే చంద్రబాబుకు కేంద్రం పరిధిలోని ఐటీశాఖ 118 కోట్ల ముడుపుల బాగోతంలో నోటీసులు ఇస్తే నోరు ఎత్తడు..రూ. 371 కోట్ల స్కిల్ అవినీతి బాగోతంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే మాత్రం జగన్ సర్కార్ కక్ష సాధింపు అంటూ..రోడ్ల మీద పడుకుని…రంకెలు వేస్తుంటాడు..ఇదే కేసులో ఈడీ, జీఎస్టీ అధికారులు పలువురిపై కేసులు నమోదు చేసి స్కిల్ స్కామ్‌లో భారీ కుంభకోణం జరిగిందని గుర్తించి..ఏపీ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావించడు..కానీ చంద్రబాబు అరెస్ట్ అయితే సొంత పుత్రుడు నారా లోకేష్ కంటే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ చేసిన ఓవరాక్షన్ తెలుగు ప్రజలకే కాదు..జనసేన శ్రేణులకు కూడా షాక్ ఇచ్చింది…
ఎక్కడైనా ప్రధాన ప్రతిపక్షం పతనమయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు మరింత బలోపేతం అవడానికి, ఆ పార్టీ స్థానంలో తాము వచ్చేందుకు ప్రయత్నిస్తాయి…ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ కు పార్టీని అధికారవైసీపీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి..కానీ పదేళ్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా..చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడు పోయిన తరహాలో పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నాడు. పార్టీని క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలోపేతం చేయని పవన్ కల్యాణ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడు…చంద్రబాబు ఏ పదో, పదిహేను సీట్లు విసిరినా చాలు అన్నట్లుగా దేబిరిస్తున్న పవన్ వ్యవహారశైలిపై జనసేన నాయకుల్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది. రాంగోపాల్ వర్మ అన్నట్లుగా కాపుల ఆత్మగౌరవాన్ని కమ్మ కులదైవం అయిన చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నడంటూ పవన్ కల్యాణ్‌పై కాపు సామాజికవర్గం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
.ఇక చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసిన రోజు సొంత పుత్రుడు నారా లోకేష్ కంటే..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ విజయవాడ హైవేపై చేసిన ఓవరాక్షన్ చూసి తెలుగు ప్రజలు విస్తుపోయారు. మరోవైపు తన మరిది చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై, ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ఇచ్చిన బంద్‌కు జనసేనతో పాటు బీజేపీ కూడా మద్దతు ఇస్తుందంటూ ప్రకటన చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన పేరుతో తప్పుడు ప్రకటన ఇచ్చారంటూ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన చిన్నమ్మ జైలుకు వెళ్లి తన మరిదిని కలవకుండా జాగ్రత్తపడ్డారు. పైగా చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా ఛానళ్లు చేస్తున్న విమర్శలకు
పవన్ కల్యాణ్ మౌనం వహించడం చూస్తుంటే..ఇక బీజేపీతో పొత్తును కూడా వదిలేసి చంద్రబాబు కోసం టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిపోయాడని అందరికీ అర్థమైపోయింది..
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రేపు చంద్రబాబును కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను ములాఖత్ కోరినట్లు సమాచారం. ఈ మేరకు 14 వ తేదీ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు బామ్మర్థి, తోటి సినీ నటుడు బాలయ్యతో కలిసి చంద్రబాబుతో పవన్ ములాఖత్ ద్వారా భేటీ అవనున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ములాఖత్ ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది…టీడీపీ, జనసేన పొత్తులతో పాటు..తన అరెస్టుకు నిరసనగా రెండు పార్టీల ఉమ్మడి పోరాటం ఎలా చేయాలి అనేదానిపై చంద్రబాబు దత్తపుత్రుడికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అనిపించుకోవాల్సిన పవన్ కల్యాణ్.. తనకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు కోసం పార్టీని పణంగా పెడుతున్న తీరు చూస్తుంటే…విస్మయం కలుగుతోంది..నిజంగా పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అన్న విమర్శలను నిజం చేస్తున్నాడని జనసేన అభిమానులే వాపోతున్నారు..