ఇన్నాళ్లు దొరకని దొంగలా దర్జాగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తనపై ఉన్న కేసుల్లో స్టే లు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది..స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ సిద్ధార్థ్ లూథ్రాని తెప్పించున్నా లాభం లేకపోయింది..కాకలు తీరిన లూథ్రా కూడా సీఐడీ ఏఏజీ పొన్నవోలు వాదనల ముందు లూథ్రా మైండ్ లూజ్ అయిపోయింది…చంద్రబాబుని జైల్లో వేసే స్కిల్లు ఎవరికి లేదు అంటూ విర్రవీగిన టీడీపీ నేతలకు, పచ్చమీడియాకు పిచ్చెక్కిపోయేలా..సీఐడీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇన్నాళ్లు తననెవరూ ఏం పీకలేరు అంటూ పీకుడు భాషలో జగన్‌ని రెచ్చగొట్టిన చంద్రబాబు ఒక్క పీకుడుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడ్డారు..
అప్పటి నుంచి లోకేష్, లూథ్రా బ్యాచ్ బాబుగారిని బయటకు తీసుకువచ్చేందుకు చేయని ప్రయత్నమూ లేదు..వేయని పిటీషనూ లేదు..ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వగానే..అబ్బే మా బాబుగారినే జైల్లో పెడతారా..ఆయనకు జైల్లో ప్రాణహానీ ఉంది…కనీసం హౌస్ అరెస్ట్ కు అవకాశం ఇవ్వండి అంటూ ఓ పిటీషన్ వేస్తే..వెన్నుపోటు బాబుగారికి ఇంట్లో కంటే..జైల్లోనే భద్రత..ఆయన ప్రాణాలకు మాది గ్యారంటీ అని పొన్నవోలు వాదన ముందు మళ్లీ లూథ్రా తేలిపోయాడు.దీంతో హౌస్ అరెస్ట్ పిటీషన్ ని కొట్టేసింది…ఇక హైకోర్టులో మనకు అనుకుల న్యాయమూర్తులు ఉన్నారు..ఈ కేసులో కూడా జగన్‌కి మొట్టికాయలు వేయిద్దాం అని అక్కడ క్వాష్ పిటీషన్ వేస్తే..హుష్..ఇంకా విచారణకు చాలా టైమ్ ఉందంటూ హైకోర్టు కూడా ఆ పిటీషన్ ని వాయిదా వేసింది..ఇక చేసేదేమి లేక..పుంగనూరు అంగళ్లు విధ్వంసం కేసులో మళ్లీ సీఐడీ అరెస్ట్ చేస్తే ఎక్కడ మళ్లీ 14 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందోనని..భయపడిన చంద్రబాబు..ముందస్తు బెయిల్ పిటీషన్ వేస్తే..అది కూడా వినాయక చవితి తర్వాత చూద్దాంలే అని హైకోర్టు వాయిదా వేసింది..ఇలా వరుస పిటీషన్లలో ఎదురుదెబ్బలు తగులుతుండడంతో లూథ్రా బుర్ర లూజ్ అయి…గురుగోవింద్, ఔరగంజేబు, కోర్టుల్లో న్యాయం దొరకకపోతే..కత్తులు పట్టాలి అంటూ వైర్యాగంతో కూడిన ట్వీట్లు చేస్తుంటే లూథ్రా బాబుగారి కేసుల్లో చేతులెత్తేసాడని…ఇక ఇప్పట్లో జైలు నుంచే పరిస్థితులు కనిపించడం లేదని పచ్చబ్యాచ్ గొల్లుమంటోంది…
ఇక లాభం లేదనకుని మళ్లీ ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ వేశారు..దీనిపై ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు అమరావతి స్కామ లో పాత్రధారి అయిన టీడీపీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ఎంటర్ అయి..చంద్రబాబు కు బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ వాదనకు దిగాడు..అయితే ఏసీబీ న్యాయవాదులు ధీటుగా తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లకు విచారణ అర్హత లేదు..రెండు బెయిల్ పిటిషన్లలో ఒకే సెక్షన్ల ద్వారా అప్లై చేశారని…ఈ రెండు పిటిషన్లలో బెయిల్ కోసం నిర్ణీత కారణం చెప్పలేదని, హైకోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్‌పై స్టే ఉండగా మళ్లీ ఇక్కడ బెయిల్ వేయటం విరుద్ధమని బాబుగారి లాయర్ల బెండు తీశారు..
అయినా నిందితుడి కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితేనే మధ్యంతర బెయిల్ అడుగుతారని, .(బాబుగారు జైల్లో ఉంటే..ఇక్కడ లోకేష్, భువనేశ్వరీ, బాలయ్యలు.. ఎంచక్కా హ్యాపీగా పరామార్శకు వచ్చిన రఘురామ , పవన్ లాంటి నేతలతో నవ్వుతూ ఫోటోలు దిగుతూ..ఎంజాయ్ చేస్తున్నారు) మధ్యంతర బెయిల్ కూడా 24 లేదా 48గంటలు ఇస్తారు..హైకోర్టులో వేసిన పిటిషన్ నే ఇక్కడ వేశారు.. నిందితుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు..ఇప్పుడు చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ రిమాండ్ టైంలోనే చెప్పారని సీఐడీ న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.దీంతో . కౌంటర్ దాఖలు చేయటానికి మంగళవారం వరకూ సమయం వస్తూ రెండు బెయిల్ పిటీషన్లపై విచారణను ఈ నెల 19 వరకు వాయిదా వేసింది..మొత్తంగా ఇన్నాళ్లు చట్టం, న్యాయవ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు అదే న్యాయవ్యవస్థలలో బెయిల్ కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు..అయినా అన్నీ రోజులు ఒకలా ఉండవు..బాబుగారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది..నేరం రుజువైతే పర్మినెంట్‌గా జైల్లో చిప్పకూడు తినే గతి పట్టక మానదు..