Home / ANDHRAPRADESH / చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన స్కామ్‌స్టర్ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.. ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని..18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా దర్జాగా తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..ఇక వరుసగా చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలపై చార్జి‌షీట్లు వేసేందుకు సీఐడీ సిద్ధమవడంతో ఇప్పట్లో బాబుగారి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు..దీంతో టీడీపీ నేతలు, పచ్చ మీడియా బాసులకు పిచ్చెక్కిపోయినట్లు మా చంద్రబాబు నిప్పు…ఆయన్నే జైల్లో వేస్తారా..ఇదంతా జగన్ సర్కార్ కక్ష సాధింపు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ స్వయంగా స్పందించారు.

ఇవాళ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందిచే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, బాలయ్యతో సహా ఎల్లోమీడియాని ఏకిపారేసారు. ఇటీవలే అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్టయ్యారని జగన్ అన్నారు. ఇన్ని అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. 45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్‌మనీ పంచుతూ పట్టుబడ్డారని ప్రస్తావించారు. ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్‌ కూడా నిర్ధారించిందని.. కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తుచేశారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని ఓటుకు నోటు ఉదంతాన్ని జగన్ గుర్తు చేశారు.

ఇక ఫేక్‌ అగ్రిమెంట్‌తో లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి బాబు స్కాం చేశారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు. స్కిల్‌ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించింది. డబ్బును డొల్ల కెంపీలకు ఎలా మళ్లీంచారన్నది ఈడీనే బయటపెట్టింది. చంద్రబాబు పీఏ చాటింగ్‌లను ఐటీశాఖ బయటపెట్టింది. ఫేక్‌ అగ్రిమెంట్‌ దొంగలను ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్‌కు పంపింది. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా, ఈడీ అరెస్ట్‌ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. స్కిల్ స్కామ్‌లో ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న పవన్‌ ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్‌లో మిలాఖత్‌ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు అంటూ ఇటు ఎల్లోమీడియా అధిపతులను, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ పై కుటిల రాజకీయం చేస్తున్న లోకేష్ అండ్ కో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని, పచ్చమీడియా ఛానళ్ల పన్నాగాలను సీఎం జగన్చ తన సూటిగా తన వాగ్ధాటితో ప్రజల ముందు ఎండగట్టారనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat