Home / ANDHRAPRADESH / సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబు-లోకేశ్ లపై సెటైర్.!

సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబు-లోకేశ్ లపై సెటైర్.!

సోషల్ మీడియా ఇది నేటి అధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమై పోయింది.సోషల్ మీడియాను కొంతమంది చెడుకి వాడుకుంటున్నారు. మరికొంతమంది మంచికి వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోన్న ప్రధానాంశం డేటా చోరి వివాదం.. ఈవివాదం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్ లు కల్సి టీడీపీని బలహీనపరచాలని.. ఏపీపై కుట్రలు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. ఏకంగా చంద్రబాబు అయితే అసలు ఏపీకి చెందిన కంపెనీలపై తెలంగాణ పోలీసులు ఎలా విచారణ చేయిస్తారు అని విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారు చంద్రబాబు. దొంగతనం చేయనప్పుడు బాబు ఎందుకు భయపడుతున్నారు. దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలంటూ సవాళ్ళు విసిరారు. ఈ క్రమంలో తెలంగాణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ విజయ్ అనే యువకుడు బాబు,లోకేశ్ ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీకి ఎలా అప్పజెప్పారు. ఎలా దొరికారు. దొరికితే ఎలా స్పందిస్తున్నారు ఇలా పలు అంశాలను మేళవిస్తూ చేసిన సెటైరికల్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.

గుమ్మడి కాయ దొంగ ఎవరు…

లోకేష్ – నాన్నగారు నేను చెప్పేస్తున్నా..

బాబు—నువ్ ఆగరా లోకేషా..
గుమ్మడి కాయ ఇంట్లోకి తెస్తుంటే మీరెలా పట్టుకుంటారు…

బాబుగారు గుమ్మడికాయ దొంగ ఎవరు అని మేమడిగేది…

బాబు – గుమ్మడి కాయ పండిందో లేదో టెస్ట్ చేద్దామని ఇంటికి తీసుకొస్తే మీరెలా పట్టుకుంటారు..

అదికాదు బాబు గారు అసలు గుమ్మడికాయ దొంగ ఎవరండి..దీనికి సమాదానం చెప్పండి…

బాబు – గుమ్మడి కాయలు తెంపుతుంటే పట్టుకునే అధికారం మీకు ఎవరిచ్చారు.మాకు గుమ్మడితోట ఉంది,మాకు కాయలున్నయ్…

ఇంతకి దొంగ మీరేనంటారా..

బాబు – అలాకాదు అసలు గుమ్మడికాయలు పంట పెట్టమని చెప్పిందే నేను..ఆ కాయ అలా కాయడానికి కారణం నేనే..

లోకేష్ – నాన్నగారు నాకేం అర్దమైతలేదు..

బాబు — అర్దమైతే నువ్వు లోకేష్ ఎలా ఐతవ్..అలా చెప్తే నేను చంద్రబాబు ఎట్లైతరా..మనం ఇట్లా మేనేజ్ చేస్తూ ప్రపంచానికే పాఠాలు చెప్తన్నం..మనకు ఓ రెండు చానెల్స్ ఉన్నయ్ కదా అవి చూసుకుంటయ్ లే పాలుతాగి పడుకో..

వామ్మో నువ్వు మారలేదు బాబయ్య..తప్పు చేసింది నీవైనా ఎట్టి పరిస్థితుల్లో తప్పు మాత్రం ఒప్పుకోవు.దటీజ్ గజకర్ణ గోకర్ణ,టక్కు టమార చంద్రబాబు..ఇదే అతను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నేర్చిన వెన్నుపోటు విజన్..

-Telangana Vijay

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat