Home / Jhanshi Rani (page 49)

Jhanshi Rani

ట్రైన్‌లో దారుణం.. వాటర్‌ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని పాంట్రీ సిబ్బంది కిందకి తోసేశారు. రవి యాదవ్ అనే ఓ వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాటిల్, గుట్కా విషయంల రవి, పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో లలిత్‌పుర్ స్టేషన్‌లో రవి సోదరి దిగిపోగా, రవిని పాంట్రీ సిబ్బంది అడ్డుకొని దిగనివ్వలేదు. ఆయనపై దాడి …

Read More »

సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!

బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఆయనకు కోటక్‌ సెక్యూరిటీస్‌ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్‌ అకౌంట్‌ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్‌ చెక్‌ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …

Read More »

థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్‌…

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్ నటించారు.

Read More »

స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..

ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …

Read More »

తల్లీకొడుకు కలిసే చదివారు.. గవర్నమెంట్‌ జాబ్‌తో అదరగొట్టారు…

కొడుకును ప్రయోజకుడిని చేయడానికి చిన్నతనం నుంచి దగ్గరుండి చదివించింది. కొడుకు చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు తానూ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బిందు 42 ఏళ్లు.. కొడుకును పదో తరగతి పరీక్షలకు చదివిస్తూ ఆమె పుస్తకాలు తిరగేసేది. దీంతో ఆసక్తి పెరిగి కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (పీఎస్‌సీ) పరీక్షలకు శిక్షణ తీసుకుంది. తాజాగా బిందు …

Read More »

మెగాస్టార్‌పై బండ్లన్న వీర విధేయత.. ట్వీట్‌ వైరల్

అవకాశం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై వీరవిధేయత చూపించే నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. సందర్భాన్ని బట్టి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల గురించి తన స్పీచ్‌లు, సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ప్రస్తావిస్తుంటారు. లేటెస్ట్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో చిరంజీవి లుక్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. ‘‘ఇలాంటి స్టైల్ చూసే మీపై ప్రేమ పెంచుకున్నాం. ఆ స్టైల్ చూసే సినిమా రంగం వైపు మేం పరుగులు పెట్టాం. ఆ స్టైల్‌తోనే సినిమా …

Read More »

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా?

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవితో రజనీకాంత్‌ సమావేశమయ్యారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. …

Read More »

కామన్వెల్త్‌ గేమ్స్‌లో అదరగొట్టేసి పీవీ సింధు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌లో సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది. సింగిల్స్‌ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్‌ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్‌ గేమ్‌లో 21-15, రెండో గేమ్‌లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి …

Read More »

ఆ సీనియర్ కమెడియన్‌కు అమీర్‌ఖాన్ ఎవరో తెలీదంటా..!

ఆయనో ఫేమస్ కమెడియన్.. 40 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ అదే రంగానికి చెందిన ఓ స్టార్‌హీరో ఎవరో తనకు తెలీదట.. తాజాగా ఆ నటుడు మీడియాతో ముచ్చటించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. స్టార్‌ హీరోలు, తోటి నటులు, నటులు గురించి తెలియకపోతే ఇండస్ట్రీలో ఉండడం దేనికో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకూ ఇలాంటి కామెంట్స్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat