Home / CRIME (page 2)

CRIME

తీన్మార్‌ మల్లన్నకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు

తీన్మార్‌ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్‌ 197/2021లో ఐపీసీ సెక్షన్‌ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్‌ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్‌పీసీ సెక్షన్‌ …

Read More »

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం

అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయ‌డ‌మే దీని లక్ష్యం. ఇది అంతర్జాతీయ నేర విభాగంలో న్యాయాన్ని సైతం ప్రోత్సాహిస్తుంది. ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. చరిత్ర: రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవంగా 1998లో నిర్ణయంచారు. అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా …

Read More »

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

హైదరాబాద్ లో వ్య‌భిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  సోమాజిగూడ‌లో ఓ హోట‌ల్‌లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి హోట‌ల్‌లోని రెండు గ‌దుల్లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లు పంజాగుట్ట పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు శుక్ర‌వారం రాత్రి ఆ హోట‌ల్‌పై దాడి చేసి ఐదుగురు యువతుల‌ను, ఈ దందా నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోష‌ల్ …

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »

చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే..లేచి తిరిగోచ్చాడు..

రాజ‌స్థాన్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. చ‌నిపోయాడ‌ని ఓ వ్య‌క్తికి అంత్య క్రియ‌లు నిర్వ‌హిస్తే వారం త‌ర్వాత ఆ వ్య‌క్తి ఇంటికి వ‌చ్చిన ఘ‌ట‌న తాజాగా బ‌య‌ట‌ప‌డింది. రాజ్‌స‌మంద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ద‌వాఖాన ఆర్కే హాస్పిట‌ల్‌లో మ‌ర‌ణించిన గోవ‌ర్ద‌న్ ప్ర‌జాప‌తి మ్రుత‌దేహాన్ని పొర‌పాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లార‌ని విచార‌ణ‌లో తేలింది. వారిద్ద‌రూ అదే ద‌వాఖాన‌లో చికిత్స పొందారు. అస‌లు క‌థేమిటంటే ఓంకార్ …

Read More »

మాజీ మంత్రి ఈటల భూబాగోతంపై మరో దర్యాప్తు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి KCR కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన …

Read More »

సుప్రీం కోర్టుకు RRR

బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.

Read More »

నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Read More »

ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్

విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్‌ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు …

Read More »