Home / CRIME (page 5)

CRIME

వికారాబాద్‌లో ఘోరం

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు మృతిచెందారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మరొకరు …

Read More »

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో …

Read More »

ప్రేమను ఒప్పుకోరని

తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ …

Read More »

21 ఏళ్లుగా మ‌హిళ‌పై అత్యాచారం

కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఓ మాన‌వ మృగం.. 21 ఏళ్లుగా ఓ మ‌హిళ‌పై అత్యాచారం చేశాడు. అత‌నొక్క‌డే కాదు.. మ‌రో ఇద్ద‌రు స్నేహితులు ఆమెపై విరుచుకుప‌డ్డారు. చివ‌ర‌గా 9 నెల‌ల క్రితం ఆ మ‌హిళ‌ను హ‌త్య చేసి ఖ‌న‌నం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్‌లో చోటు చేసుకుంది. 21 ఏళ్ల క్రితం ఓ యువ‌తి పోస్టు గ్రాడ్యుయేట్‌ను పూర్తి చేసింది. ఆ యువ‌తి చ‌దివిని కాలేజీలో అక్క‌డ …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌తో దురుసుగా మాట్లాడిన ఓ యువ‌కుడిని బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువ‌కుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ న‌సీర్ అహ్మ‌ద్ కుమారుడు ఫ‌యాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫ‌యాజ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన ఫ‌యాజ్ ఆదివారం రాత్రి పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. అంత‌టితో ఆగ‌కుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న …

Read More »

ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు ఫారుక్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ కు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చలి వేస్తోందని చౌటుప్పల్ దగ్గర ఆగాడు. స్వెట్టర్ వేసుకుంటుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకుపై కూర్చున్న ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితునికి ఎలాంటి గాయాలు కాలేదు

Read More »

భార్యపై అనుమానంతో..!

అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు. తన భార్యఅనంతసాగర్‌ గ్రామానికి చెందిన …

Read More »

కీస‌ర మాజీ త‌హ‌సీల్దార్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య

తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన అవినీతి, లంచం కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  కీస‌ర మాజీ త‌హ‌సీల్దార్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచ‌ల్‌గూడ జైల్లో నాగ‌రాజు ఉంటున్నాడు. నాగ‌రాజు మృత‌దేహాన్ని చంచ‌ల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. ల్యాండ్ సెటిల్‌మెంట్ కేసులో కోటి ప‌ది ల‌క్ష‌ల రూపాయాలు లంచం డిమాండ్ చేసిన ఆయ‌న ఏసీబీకి అడ్డంగా చిక్కిన …

Read More »

రేటింగ్‌ స్కాంలో రిపబ్లిక్‌ టీవీ

టీఆర్పీ రేటింగ్స్‌ స్కామ్‌ గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు. ప్రముఖ చానెల్‌గా వెలుగొందుతున్న రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం రేటింగ్‌ స్కాంకు పాల్పడినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు. రిపబ్లిక్‌ టీవీ రేటింగ్‌ స్కాంకు పాల్పడినట్లు పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం, డైరెక్టర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరంవీర్‌ సింగ్‌ వెల్లడిస్తూ… రిపబ్లిక్‌ టీవీతో పాటు మరో రెండు చానెళ్లు రేటింగ్‌ …

Read More »

ఏసీపీ ఇంట్లో 5 కోట్ల ఆస్తులు గుర్తించాం : ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామ‌ని అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) డిప్యూటీ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డి తెలిపారు. హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, క‌రీంన‌గ‌ర్‌తో పాటు అనంత‌పురంలో మొత్తం 25 చోట్ల‌ సోదాలు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామ‌ని …

Read More »