Home / CRIME (page 4)

CRIME

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్‌ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read More »

కంగనా రనౌత్ పై కేసు నమోదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది

Read More »

భర్తకు బట్టతల ఉందని భార్య..?

భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …

Read More »

టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య-మంత్రి రాజీనామా

మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.

Read More »

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు

Read More »

14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ

14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …

Read More »

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది, కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. 29 మంది ప్రయాణికులతో.. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు …

Read More »

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ

Read More »

చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.

Read More »

డబ్బు ఆశచూపి బాలికపై

డబ్బుల ఆశచూపి ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం …ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు 10 ఏండ్ల క్రితం నగరానికి వలసవచ్చి, నగరశివారు సూరారం సిద్ధ్దార్థనగర్‌లో స్థిరపడ్డారు. రోజూ వారి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు. తల్లిదండ్రులు ఇద్దరు రోజూ కూలీపనులకు వెళుతుండగా.. …

Read More »