Home / NATIONAL (page 21)

NATIONAL

తమిళనాడులో లాక్డౌన్

ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …

Read More »

ముత్తవెలు కరుణానిధి స్టాలిన్ “ప్రస్థానం”

తమిళ రాజకీయాలు లో 68 సంవత్సరాలు వచ్చిన యువ నాయకుడు గానే వెలుగొందారు.. తండ్రి చాటు బిడ్డ .. రష్యా సోషలిస్ట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ చనిపోయిన 4 రోజులు కి స్టాలిన్ జన్మించారు.. అందుకే కరుణానిధి జోసెఫ్ స్టాలిన్ గుర్తుగా కొడుకు కి స్టాలిన్ అని పేరు పెట్టారు.. 14 ఏటా మేనమామ మురుసోలి మారన్ కి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నట ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. …

Read More »

SBI కస్టమర్లకు హెచ్చరికలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు. SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను …

Read More »

తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్తో ప్రమాణం చేయించారు. మరో 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ అవకాశమిచ్చారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనార్టీలకు స్థానం దక్కింది. ఇటీవల ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ డీఎంకే 133 సీట్లు గెలిచి, విజయం సాధించింది.

Read More »

వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట

దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.

Read More »

దేశంలో 4,12,262 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

అజిత్ సింగ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ …

Read More »

కరోనా కట్టడీకి అదోక్కటే మార్గం

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటిన, 60 శాతం బెడ్లు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డ్ డౌన్ విధించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు కరోనా చైన్ని తెంచలేవన్నారు. ప్రాంతీయ లాక్డౌనే ఏకైక మార్గమన్న ఆయన.. ఇదే అంశం కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఉన్నా అమలు పరచడం లేదన్నారు.

Read More »

అందాన్ని ఆదరించని ఓటర్లు

యూపీ పంచాయతీ ఎన్నికల్లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్షా సింగ్ ఓడిపోయారు. జౌనప్పర్ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన ఆమె.. 2వేల ఓట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు. మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేశారు.

Read More »

ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా దీదీ ప్రమాణం

వెస్ట్ బెంగాల్ సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి బరిలోకి దిగిన మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆర్టికల్ 164(4) ప్రకారం మంత్రిగా/ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల్లోపు చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకోవాలి. బెంగాల్లో శాసనమండలి లేదు కాబట్టి మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ ఉపఎన్నికల్లో గనుక మమత ఓడిపోతే సీఎంగా రాజీనామా చేయాల్సిందే.

Read More »