Home / NATIONAL (page 22)

NATIONAL

అందాన్ని ఆదరించని ఓటర్లు

యూపీ పంచాయతీ ఎన్నికల్లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్షా సింగ్ ఓడిపోయారు. జౌనప్పర్ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన ఆమె.. 2వేల ఓట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు. మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేశారు.

Read More »

ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా దీదీ ప్రమాణం

వెస్ట్ బెంగాల్ సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి బరిలోకి దిగిన మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆర్టికల్ 164(4) ప్రకారం మంత్రిగా/ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల్లోపు చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకోవాలి. బెంగాల్లో శాసనమండలి లేదు కాబట్టి మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ ఉపఎన్నికల్లో గనుక మమత ఓడిపోతే సీఎంగా రాజీనామా చేయాల్సిందే.

Read More »

కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఇంట విషాదం

కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు యోగితా సోలంకి (42) కరోనా సోకి మరణించారు. గత వారం రోజులుగా ఆమె ఇండోర్లోని మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 80 శాతం వరకు వైరస్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు

Read More »

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

50ఏళ్ళుగా ఓటమి ఎరుగని మాజీ సీఎం

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పూతుపల్లి నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తొలిసారి 1970లో తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు చాందీ తొలి విజయం సాధించారు. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఇది 12వ సారి. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 50 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Read More »

అసోంలో పరువు నిలుపుకున్న బీజేపీ

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో BJP కూటమి 75 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 50సీట్లలో పాగా వేసింది. ఇతరులు ఒక్క సీటు సాధించారు. బీజేపీ 60 స్థానాల్లో పట్టు సాధించింది.. మిత్రపక్షాలైన అసోం గణపరిషత్, UPPL లతో కలిసి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.సీఏఏ ఆందోళనలతో ఇబ్బంది ఎదురైనా.. పట్టు నిలుపుకుంది అధికార బీజేపీ పార్టీ…

Read More »

భయమెరుగని దీదీ

1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, లోకసభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీపై సంచలన విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. 1989లో ఓడి 1991లో మళ్లీ గెలిచారు. 36 ఏళ్లకే కేంద్రమంత్రి అయ్యారు. 1997లో టీఎంసీ పార్టీని స్థాపించారు. 1998, 99, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. 2011లో తొలిసారి బెంగాల్ గడ్డపై కమ్యూనిస్టులను గద్దె దించి, సీఎం …

Read More »

తాను ఓడిన గెలిచిన దీదీ..అది ఎలా అంటే..?

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ఆదివారం విడుదలయ్యాయి..ఈ ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 213,బీజేపీ 77,ఇతరులు 2చోట్ల గెలుపొందారు.. అయితే ప్రధానమంత్రి నరేందర్ మోదీ,హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి రాజకీయ నేతలను ఎదుర్కొంటూ బెంగాల్లో ఒంటిచేత్తో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించిన మమత.. తాను మాత్రం ఓటమి పాలైంది. సిట్టింగ్ స్థానమైన భవానీపూర్ను వదులుకున్నది..ప్రత్యర్థి విసిరిన సవాల్ ని స్వీకరించి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. …

Read More »

ముచ్చ‌ట‌గా మూడోసారి మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్లో ముచ్చ‌ట‌గా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకువెళుతోంది. ఇప్పటికే టీఎంసీకి  స్ప‌ష్ట‌మైన మెజారిటీ వచ్చింది.  మేజిక్ ఫిగర్ మార్క్ దాటేసిన‌ తృణమూల్ కాంగ్రెస్…  202 స్థానాల్లో ముందంజలో కొన‌సాగుతోంది. 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, నాలుగు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.  వెనుకంజలో కాంగ్రెస్, వామపక్ష కూటమి కొనసాగుతోంది. అయితే నందిగ్రాంలో మమతా బెనర్జీ కంటే 4,500 ఓట్ల ఆధిక్యంలో  …

Read More »

తమిళనాడు ఎన్నికల ఫలితాలు -సీన్ రివర్స్ -నువ్వా.. నేనా..?

తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. డీఎంకేకు పళనిస్వామి ఆధ్వర్యంలోనే అన్నాడీఎంకే గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉదయం 10.45 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం డీఎంకే కూటమి 94 స్థానాల్లో …

Read More »