Home / Tag Archives: national news (page 3)

Tag Archives: national news

మణిపూర్ నగ్న వీడియోపై సీఎం సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా అలజడి రేపిన మహిళల నగ్నంగా ఊరెగింపు వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదయింది. వీడియో కూడా దొరికింది. కానీ పార్లమెంట్ సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు. ఇందులో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్లో బీజేపీ సర్కారు ఉండటం వల్లే …

Read More »

మణిపూర్ లో మరోదారుణం

మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన జరిగిన అదే రోజు మరో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్ పీక్సీ ప్రాంతంలో కార్ సర్వీస్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించినట్లు.. అక్కడ యువతులు చనిపోయినట్లు, వారి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది.

Read More »

లోక్ సభ రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సభ ప్రారంభమైన మొదట్లో లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే లోక్ సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా …

Read More »

దేశంలో అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు వీళ్లే..?

ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి. వారిలో ముగ్గురికి రూ.1000 …

Read More »

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.

Read More »

గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువ

గుజరాత్‌ దేశానికే రోల్‌ మాడల్‌గా నిలిచిందంటూ ఊదరగొట్టే బీజేపీ నేతల మాటలన్నీ కల్పితాలేనని మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఐదేండ్లలోపు మొత్తం చిన్నారుల్లో 9.7 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ బరువుతో ఉన్నట్టు తేలింది. వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో, శారీరక బలహీనత …

Read More »

ప్రధాని మోదీపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్  మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ …

Read More »

ప్రధాని మోదీ,సీఎం యోగి పై చర్చ వల్ల ఓ నిండు ప్రాణం బలి

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు.. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.. దీంతో రాజేష్ ను  కారు …

Read More »

ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో జరిగిన  కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కొన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. వేల మంది గాయాలపాలైన సంగతి తెల్సిందే. మరువక ముందే  అదే రాష్ట్రంలో మరో రైలు బోగీలో మంటలు రావడం కలకలం రేపింది. దుర్గ-పూరీ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ఖరియార్ రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ …

Read More »

మధ్యప్రదేశ్ లో తప్పిన ఘోర రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిన్న రాత్రి షాపూర్ భిటోని స్టేషన్ సమీపంలో గ్యాస్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు రెండు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. జబల్పూర్ జిల్లాలోని ఓ గ్యాస్ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రధాన లైను ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat