ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా సమర్పించారు. CMగా తీరత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి 6 నెలలు ముగుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 చోట్ల సెప్టెంబర్ 10 లోపు ఉపఎన్నికల నిర్వహణ సాధ్యం కానందునే ఆయన రాజీనామా చేశారు. తీరత్ బాధ్యతలు చేపట్టి 4 నెలలే కావడం గమనార్హం. రేపు …
Read More »శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు
శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా టీమిండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో లంక టీం ఓటమిపాలై, భారత్ను రెండో స్థానానికి నెట్టింది. మొత్తం 428 మ్యాచ్ పరాజయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. 414 ఓటములతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.
Read More »వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా కలర్ తెలుసా..?
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ..నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా షర్మిల ఈ నెల 8న ప్రారంభించనున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో …
Read More »దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 44,111 కేసులు నమోదవగా, 738 మంది చనిపోయారు. మరో 57,477 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువకు చేరాయి. మొత్తం కేసుల సంఖ్య: 3,05,02,362 మరణాలు: 4,01,050 కోలుకున్నవారు: 2,96,05,779 యాక్టివ్ కేసులు: 4,95,533
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత …
Read More »అన్ని భూ సమస్యలకు పరిష్కారం ధరణి
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో కొత్త ఫీచర్ను జతచేశారు. బాధితులు సమస్యను వివరిస్తే.. అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ ఫీచర్ తీసుకొచ్చారు. 10 రకాల సమస్యలకు చోటు కల్పించారు. మొత్తం 37 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిద్వారా 90 శాతానికిపైగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
Read More »దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట
ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.
Read More »పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.
Read More »పాన్ ఇండియన్ మూవీలో బన్నీ
యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.
Read More »హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సోమాజిగూడలో ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హోటల్‌లోని రెండు గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆ హోటల్‌పై దాడి చేసి ఐదుగురు యువతులను, ఈ దందా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ …
Read More »