Breaking News
Home / NATIONAL / రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది-స్టార్ హీరోయిన్..!

రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది-స్టార్ హీరోయిన్..!

రాహుల్ గాంధీకి ఇన్నేళ్లు వచ్చిన కానీ వివాహాం కాలేదన్న సంగతి మనకు తెల్సిందే. అయితే తాజాగా పెళ్లి చేసుకుని మంచిగా సెటిలైన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ ను వివాహాం చేసుకున్న సంగతి విదితమే.వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మీకు ఎవరితో డేటింగ్ కు వెళ్లాలని ఉంది అని  అడిగారు.

దీనికి సమాధానంగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ”నాకు పెళ్ళి అయిన కానీ కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది “అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి.