మీరు జియో వాడుతున్నారా.. మీరంతా జియో యూజర్లా.. అయితే ఇది మీకు శుభవార్త. అదే ఏమిటంటే మరో నెల పాటు వినియోగదారులు బిల్లు చెల్లించనవసరం లేదు. గత నెలలో ఐదు లక్షల మంది కస్టమర్లు జియో ఫైబర్ ని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారితో పాటు ఇతర జియో సేవల పొందుతున్న వారందరికీ ఒకే బిల్లింగ్ సిస్టమ్ ను రూపొందించే పనిలో జియో ఉంది. ఈ ప్రక్రియలో కొంత సమయం పడుతుంది. ఇందుకే యూజర్లకు మరో నెల పాటు బిల్లింగ్ ఉండదని జియో తెలిపింది.