Home / ANDHRAPRADESH / సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్

సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.