Home / NATIONAL / ఆర్ధరాత్రి 1.30కి సీఎం కి కాల్ చేసిన యువతులు..ఆ తర్వాత ఏమైంది..?

ఆర్ధరాత్రి 1.30కి సీఎం కి కాల్ చేసిన యువతులు..ఆ తర్వాత ఏమైంది..?

అర్ధరాత్రి 1:30..
కర్ణాటక-కేరళ మధ్య దట్టమైన అడవి…
13 మంది హైదరాబాద్ అమ్మయిలు..
ఆ టైమ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోన్ ఎత్తుతాడా ?
భయం భయంగా ఆయనకు పోన్ చేసిన యువతి…
తర్వాత ఎం జరిగింది ?
ఆయన పోన్ ఎత్తాడా ?
ఇక చదవండి…

హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాదులో అనేకమంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కుతోచకుండా చిక్కుకుపోయారు… వేరే రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎటు పోవాలి..? షెల్టర్, ఫుడ్ ఎంత కష్టం..? హాస్టళ్ల యజమానులతో మాట్లాడాల్సిందిపోయి ఊళ్లకు వెళ్లిపొండంటూ ఎన్ఓసీలు ఇచ్చేయడం మొదలుపెట్టారు… ఇది కాస్తా ఏపీ, తెలంగాణ యంత్రాంగాల నడుమ క్లాష్… ఉద్రిక్తతలు… సరిహద్దుల్లో వేల మంది అవస్థలు ఎట్సెట్రా వార్తలు చదివాం, చూశాం, విన్నాం… చివరకు ఒక CM ఏకంగా మీడియా ముందుకు వచ్చేసి, నథింగ్ డూయింగ్, వస్తే క్వారంటైన్ చేస్తా అని కూడా నిక్కచ్చిగా చెప్పాడు…

హైదరాబాద్ నుంచి బతుకుజీవుడా అని 13 మంది యువతులు కేరళకు వెళ్లిపోయిన కథ… కాకపోతే అక్కడి సీఎం తరహా వేరు… ఆయన పేరు తెలుసు కదా, పినరై విజయన్…

మంగళవారం రాత్రి… సాయంత్రం 7 గంటలు… హైదరాబాదులో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకునే 13 మంది కష్టమ్మీద ఓ టెంపో మాట్లాడుకున్నారు… వాళ్లను కేరళలో కొళిక్కోడ్ వద్ద వదిలిరావాలి… టెంపో ఓనర్ చెప్పిన రేటుకు సరే అన్నారు… బయల్దేరారు… తీరా దేశమంతా లాక్ డౌన్ అనే ప్రకటన వెలువడింది… మధ్యలోనే డ్రైవర్ మనసు మార్చుకున్నాడు… ఈ రాత్రి మిమ్మల్ని బోర్డర్ దాటించగలిగినా, తిరిగి వచ్చేటప్పుడు నన్ను రానివ్వరు, కేరళలోనే బుక్కయిపోవాల్సి ఉంటుంది అని డ్రైవర్ వాదన… కరెక్టే…

కర్నాటక, కేరళ బోర్డర్‌లోని ముతంగ చెక్‌పోస్టు వద్ద దింపేస్తాను అన్నాడు… తప్పదు… సరేనన్నారు… కానీ అది పక్కా అటవీప్రాంతం… అక్కడ ఆ రాత్రి దిగిపోతే, అక్కడి నుంచి వెళ్లడం ఎలా..? కనీసం తొల్పెట్టి వరకు మమ్మల్ని దింపు బ్రదర్ అని డ్రైవర్‌ను బతిమిలాడుకున్నారు… ఈలోపు తమకు తెలిసిన చుట్టాలు, మిత్రుల ద్వారా మార్గమధ్యంలో ఫోన్లు చేస్తూనే ఉన్నారు… ఎవరైనా కేరళ అధికారులు తమ రెస్క్యూలోకి వస్తారేమో అని… కానీ అప్పటికే లేటైంది… అర్ధరాత్రి దాటింది… అప్పుడు ఎవరు అందుబాటులోకి వస్తారు..?

రాత్రి 1.30 గంటలు… టీసీఎస్‌లో పనిచేసే అథీరా సాహసం చేసింది… ఎలాగోలా తనకు దొరికిన కేరళ సీఎం రెసిడెన్స్ నంబరుకు కాల్ చేసింది… చీకట్లో రాయి… తగిలితే సరి, లేకపోతే పోనీ… అవును… కొన్నిసార్లు చీకట్లో రాళ్లు కూడా సరిగ్గా తగలాల్సిన చోటే తగుల్తయ్… అప్పటికి సీఎం ఇంకా నిద్రపోలేదు… ఈ టైంలో సీఎం నివాసానికి కాల్ అంటే, ఏదో అర్జెన్సీ అయి ఉంటుంది అనుకున్నాడు… తీరా ఈ యువతుల కాల్…

ఆమెలో టెన్షన్… తడబడుతూనే విషయం చెప్పింది… ఆయన వెంటనే వాయనాడ్ కలెక్టర్, ఎస్పీల నంబర్లు ఇచ్చాడు, నేను వాళ్లకు చెబుతాను, నువ్వు కూడా వాళ్లకు కాల్ చేయమ్మా అన్నాడు… పెట్టేశాడు… ఆమె ఓసారి తన చేతిని గిల్లిచూసుకుంది…!

కలెక్టర్‌కు చేశారు, కాల్ కనెక్ట్ కాలేదు… ఎస్పీకి చేశారు, దొరికాడు…
మీరు చెక్ పోస్టు దగ్గర వెయిట్ చేయండి అన్నాడు… ఆ చెక్ పోస్టు దగ్గరికి ఆ టెంపో చేరుకుంది… అక్కడికి తిరునెల్లి ఎస్సయి జయప్రకాష్ వచ్చాడు… ఓ వాహనం సమకూర్చాడు… అందరూ తమ ఇళ్లకు బుధవారం ఉదయానికి చేరుకున్నారు… తమ ఇళ్లకు… నిజం… క్వారంటైన్‌కు కాదు…

అంత రాత్రి వాళ్లకు సీఎం కాల్‌లో దొరకడం, ఎస్పీ అప్పటికి మేల్కొని ఉండటం, వాళ్లు సహృదయంతో స్పందించడం ఇంట్రస్టింగు… సీఎం విజయనూ… నువ్వు గొప్పోడివి స్వామీ…

వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోనే హోం క్వారంటైన్లలో ఉంచారు…