తెలంగాణ రాష్ట్రంలో యువత సైన్యంలా ముందుకుసాగి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థి, యువకులకు పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీఆర్‌ఎస్వీ సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ నాడు స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస్వీ, సింగరేణి ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొనాలని కోరారు.
టీబీజీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమం లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఐడీసీ చైర్మన్ బేగ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు సురేశ్, నవీన్ పాల్గొన్నారు.