తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి సర్జరీతో సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి .. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు.
మంత్రులతో కల్సి ఆసుపత్రికెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులు.. అందుతున్న వైద్యసేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు.