తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మిగతా ఆరుగురు మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ ఆరు మంత్రి పదవులబు దాదాపు పదిహేను మంది పోటి పడుతున్నారు. వీరిలో షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్,వివేక్,వినోద్,మల్ రెడ్డి రంగారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు,మధుయాష్కీ గౌడ్,అద్దంకి దయాకర్,బాలు నాయక్ పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఈ పదవులకు సీనియార్టీ,కుల సమీకరణాల ఆధారంగా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.