తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరచిపోలేనివన్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయాన ఆలోచనలను, ఆశయలను మా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాపూజీ జయంతి సందర్బంగా ఈసీఐ ఎల్ చౌరస్తాలో మరియు చక్రిపురం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తాడూరి. ఆయాన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్, కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, కొత్త రామారావు, మహిపాల్ రెడ్డి, కనకరాజ్, సైదులు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
