కంప్యూటర్ ఆధునిక జీవితంలో ఒక భాగమైపోయింది. దీన్ని వాడకంలో మౌజ్‌ది కీలకపాత్ర. అయితే కీ బోర్డు కూడా కీలకమైనదే. టైపింగ్ చేయాలంటే దీన్ని వాడాల్సిందే. కీబోర్డులో కొన్ని షార్ట్ కట్లను వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాంటి కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సి 10 షార్ట్ కట్లు మీకోసం ..
Alt+Tab డెస్క్ టాప్‌పై ఉన్న పలు సాఫ్ట్ వేర్, ఇతర అప్లికేషన్లోకి చకచకా మారేందుకు.
Ctrl + Shift+ Esc సిస్టమ్ స్లో, హ్యాంగ్ అయినప్పుడు లోపమున్న, లేదా రెస్పాండ్ కాని ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవడానికి.
Shift + Delete మనకు ఇక ఎంతమాత్రం అవసరం లేదనుకున్న ఫైల్‌ను సిస్టమ్ నుంచి శాశ్వతంగా డిలీట్ చేయడానికి.
Windows logo key + L కంప్యూటర్ నుంచి కాసేపు పక్కకు వెళ్లినప్పుడు దాన్ని లాక్ చేయడానికి.
Ctrl + F4 యాక్టివ్ డాక్యుమెంట్‌ను క్లోజ్ చెయ్యడానికి. ఎక్కువ విండోలు ఓపెన్ అయి ఉన్నప్పుడు వాటన్నిటిని ఒకేసారి క్లోజ్ చేయడానికి.
Ctrl + Y రీడూ(మార్పు చేయడానికి ముందున్నది) పొందడానికి. సాధారణంగా Ctrl + Z వాడతాం. దానితోపాటు దీన్నీ వాడొచ్చు.
Ctrl + Shift మనం వాడుతున్న, లేదా చదువుతున్న డాక్యుమెంటులోని టెక్ట్స్‌ను సెలక్ట్ చేసుకోవడానికి. యారో బటన్లను వాడి మ్యాటర్‌ను ఎంపిక చేసుకోవాలి.
Windows logo key + D డెస్క్ టాప్ విండోలన్నింటిని ఒకేసారి మూసేయడానికి.
Windows logo key + I కంట్రోల్ ప్యానల్లో ఉన్న సెట్టింగ్స్‌ను ఓపెన్ చెయ్యడానికి.
Windows logo key + number పిన్ చేసిన యాప్స్, సాఫ్ట్ వేర్లలోకి నేరుగా వెళ్లడానికి. పిన్ చేసిన మూడో యాప్‌లోకి వెళ్లాలంటే ఆ నంబర్ నొక్కితే సరిపోతుంది.