బంగారం స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి భారత్‌కు తరలిస్తున్నారు. కొందరు బ్యాగుల్లోనూ, చెప్పుల్లోనూ, షూస్‌లోనూ బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏకంగా బంగారాన్ని మింగేసి దుబాయ్ నుంచి భారత్‌కు స్మగ్లింగ్ చేస్తున్నారు. కాగా, ఇటువంటి సంఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేసిన తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.10 లక్షల 72 వేల విలువైన గోల్డ్ బార్స్ స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
