దీపావళి సందర్భంగా ఇటీవలే జియో తన టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ప్లాన్ల రేట్లు మారాయి. వాటికి అందే డేటా బెనిఫిట్స్ వివరాలు కూడా ఛేంజ్ అయ్యాయి. కాగా కొత్తగా వచ్చిన ప్లాన్లను ఇప్పటికే చాలా మంది రీచార్జి చేసుకుని వాడుతున్నారు. అయితే జియోలో ఉన్న ఈ 4 బేసిక్ ప్లాన్ల ద్వారా లభించే బెనిఫిట్స్ ఏమిటో మీకు తెలుసా..? అవే ఇప్పుడు చూద్దాం.
రూ.19 ప్లాన్…
ఈ ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే ఒక రోజు వాలిడిటీ లభిస్తుంది. 0.15 జీబీ డేటా వస్తుంది. ఒక రోజు పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. 20 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
రూ.52 ప్లాన్…
ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు. 7 రోజుల పాటు యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. 1.05 జీబీ డేటా వస్తుంది. దీన్ని రోజుకు 0.15 జీబీ వరకు వాడుకోవచ్చు. 70 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
రూ.98 ప్లాన్…
ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు. అన్ని రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. 2.1 జీబీ డేటా వస్తుంది. దీన్ని కూడా రోజుకు 0.15 జీబీ వరకు వాడుకోవచ్చు. 140 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
రూ.149 ప్లాన్…
ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను అన్ని రోజుల పాటు వాడుకోవచ్చు. 4.2 జీబీ డేటా వస్తుంది. రోజుకు 0.15 జీబీ డేటా వరకు వాడుకోవచ్చు. 300 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.