Home / JOBS / తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు ..

తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు ..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త ..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర సర్కారు నేతృత్వంలో పనిచేసే పోస్టల్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ సంస్థముందుకొచ్చింది .అందులో భాగంగా రాష్ట్రంలోని ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది .ఆ వివరాలు ఇలా ఉన్నాయి .
పోస్టు -గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్ ,బీపిఎం ,జీడీఎస్ ఎంసీ )
జీడీఎస్ ఎంసీ బీపీఎం పే స్కేల్ -రూ 2,745 -50 -4245
జీడీఎస్ ఎంసీ పే స్కేల్ -రూ 2295 -50-4245
మొత్తం ఖాళీల సంఖ్య-127
వీటిలో జనరల్ -65 ,ఓబీసీ -30 ,పీహెచ్ -హెచ్ హెచ్ -3, పీహెచ్ సీ -ఓహెచ్ -2 ,ఎస్సీ-18 ,ఎస్టీ -9 ఉన్నాయి ..
ఈ పోస్టులన్నీ ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్నాయి ..
వయస్సు -2017 ,నవంబర్ 20 నాటికి 18-40 ఏండ్ల మధ్య ఉండాలి .ఓబీసీ లకు మూడేండ్లు ,ఎస్సీ ,ఎస్టీలకు ఐదేండ్లు ,పీహెచ్ సీ లకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు ..
విద్యార్హత -ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు /సంస్థ నుండి పదోతరగతి ఉత్తీర్ణత .అయితే అదనపు అర్హతలను పరిగణలోకి తీసుకోరు ..పదోతరగతి పరీక్షలను సప్లమెంటరీలో పాసైన

వారికంటే మొదటి ప్రయత్నంలో పాసైనవారికి ప్రాధాన్యత ఇస్తారు ..
కంప్యూటర్ నాలెడ్జ్ -గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం అరవై రోజుల పాటు కంప్యూటర్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై శిక్షణ తీసుకొన్న సర్టిఫికేట్ ఉండాలి .లేదా ఇంటర్ లేదా

డిగ్రీ లో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నవారికి ప్రత్యేకమైన సర్టిఫికేట్ అవసరంలేదు ..
నివాసం -జీడీఎస్ -బీపీఎం తప్పనిసరిగా ఎంపికైన బ్రాంచి పోస్టు ఆఫీస్ ఉన్న గ్రామంలో నివాసం ఉండాలి (నెలలో నివాసం ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలి )..
నోట్ -ఎంపికైన అభ్యర్ధులు సెక్యూరిటీ బాండ్ కింద రూ 25/10 వేల బాండ్ ను సమర్పించాలి ..
ఎంపిక విధానం -పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ..దరఖాస్తు సమయంలో పదోతరగతి సర్టిఫికేట్ ,కంప్యూటర్ సర్టిఫికేట్ ,కమ్యూనిటీ సర్టిఫికేట్ ,పీహెచ్ సీ

సర్టిఫికేట్ (ఉన్నవారు ),పోటో ,సంతకాన్ని ఆన్లైన్ జేపీజీ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి ..
దరఖాస్తు -ఆన్లైన్
చివరి తేది -డిసెంబర్ 19
ఫీజు -ఓసీ /ఓబీసీ పురుష అభ్యర్ధులకు రూ 100 ..
ఎస్సీ ,ఎస్టీ ,పీహెచ్ సీ .మహిళా అభ్యర్ధులకు ఫీజు లేదు ..
వివరాల కోసం
Help Desk number for telangana circle -040-23463639,Email-dopgdsenquiry@gmail.com
వెబ్ సైట్ -https://indiapost.gov.in

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat