తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మార్చి 11న రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్ వారికోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా అన్ని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఆదివారం ఏ కారణం చేతనైనా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే ఆ చిన్నారులకు ఆ తర్వాత రెండురోజులపాటు పోలియో చుక్కలు ఇంటింటికి వెళ్లి వేసేందుకు వైద్యశాఖ ప్రణాళికలు రూపొందించింది.
పోలియో చుక్కలు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని పోలియో చుక్కలు వేస్తున్న నర్సింగ్ విద్యార్థులే అనడంలోఎలాంటి సందేహం లేదు..దేశం మొత్తములో కానీ రాష్ట్రంలో కానీ నాలుగు రోజులు ఫోలియో చుక్కల కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నానున్నారు..కొసమెరుపు ఏమిటి అంటే.. వీరికి ఆల్ఫాఆహారం మరియు మధ్యాహ్నం భోజనం కూడా అందించాలి అని ప్రభుత్వాలు స్పష్టంగా ఆదేశిస్తున్నాయి.కానీ చాలా చోట్ల అది ఇప్పటికి కార్యరూపం దాల్చడం లేదు..అలాగే రోజుకి ఒక్కొక్క బూత్ కి నలుగురూ ఉండాలి.ఒక్కొక్క బూత్ కి 900 రూపాయలు 3 రోజులకి ఒక్కరికి 225రూపాయలు చెల్లింపు జరగాలి అని ప్రభుత్వాలు చెపుతున్నాయి..కానీ అది ఎంతవరకు క్షేత్రస్థాయిలో నర్సింగ్ విద్యార్థులకు అందుతుందో అనే దానిపై విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది.అలాగే రేపటి నుండి ఇంటి ఇంటికి వెళ్లి నర్సింగ్ విద్యార్థులు పోలియో చుక్కలు వేస్తారు…విద్యార్థులు తమ తమ కాలేజ్ నుండి కానీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుండి బయలుదేరి బయటికి వచ్చేటప్పుడు తప్పకుండా ప్రతి పదిమంది విద్యార్థులకు గాను ఒక్క అధ్యాపకులు ఉండాలి అని నిబంధనలు ఉన్నాయి.
కానీ ఈ నిబంధనలు ఏ ఒక్క నర్సింగ్ విద్యాసంస్థలు పాటించడం లేదు..నర్సింగ్ విద్యార్థులు ఫోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా ఏదైనా జరగరానిది.. జరిగితే ఎవ్వరు భాద్యులు..వారికి రక్షణ ఎవ్వరి భాద్యత… నేటి సమాజంలో పరిస్థితులు ఎలాగాఉన్నాయో అందరికి తెలిసిన వాస్తవమే..కావున ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తగుసుచనాలు జారీ చేయాలని NOA సభ్యులు కోరారు.నర్సింగ్ విద్యార్థులు వారి వారి నర్సింగ్ విద్యాసంస్థల నుండి సంబందిత ఆరోగ్యకేంద్రానికి చేరుకోవడానికి రవాణ సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు..తమ విజ్ఞాపాలపై ప్రభుత్వం వెంటనే చర్యలూ తీసుకొంటుంది అని NOA సభ్యులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ అధ్యక్షుడు శ్రీను రాథోడ్.ప్రధాన కార్యదర్శి సుస్మిత, సభ్యులు లక్ష్మణ్ రూడవత్, వెంకటేష్, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.