భర్త అక్రమ సంబంధాలను భార్య బయటపెట్టారు. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేసిన హరిప్రసాద్ సస్పెండ్ అయ్యారు. హరిప్రసాద్‌కు నిర్మల అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. అయితే గత రెండేళ్లుగా మయూరి అనే మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తమ పిల్లలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ఇంటికిరాని భర్తపై అనుమానం వచ్చిన నిర్మల తన సోదరుడు, కొందరు బంధువులతో కలిసి వెళ్లి మయూరితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్మల, సహా ఆమెతో పాటు వచ్చిన బంధువులు హరిప్రసాద్‌కు, మయూరికి దేహశుద్ధి చేశారు. అనంతరం భర్తను పోలీసులకు అప్పగించారు. కాగా, హరిప్రసాద్ భార్య నిర్మల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
భర్త బాగోతంపై నిర్మల మీడియాతో మాట్లాడుతూ.. హరిప్రసాద్‌కు మయూరి అనే మహళతో శారీరక సంబంధాలున్నాయి. ఈ కారణంగా గత కొంతకాలం నుంచి నాపై, నా పిల్లలపై దాడులకు పాల్పడుతున్నారు. నా కొడుకుకు ఇటీవల యాక్సిడెంట్ చేశారు. అయినా మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. సంవత్సరం నుంచి గొడవ ముదురుతోంది. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో పనిచేసినప్పుడు నా భర్తకు మయూరితో పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధాలపై హెచ్చరిస్తే.. మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదని బాండ్ పేపర్ల మీద నా భర్త, మయూరి రాసిచ్చారు. అందుకు సంబంధించి వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని తెలిపారు.
కొడుకుకు యాక్సిడెంట్ అయి నేను ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం వేరే మహిళల వద్దకు వెళ్తున్నాడంటూ హరిప్రసాద్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లావ్ అని అడిగితే విజయవాడ వెళ్లానంటూ బుకాయిస్తున్నారు. తెల్లారేసరికల్లా ఇంటికి వచ్చేయాలి కానీ వేరే మహిళ ఇంటికి ఎందుకు వచ్చాడని భర్తను నిలదీశారు.