Home / 18+ / భోగి, సంక్రాంతి, కనుమ పండుగలపై దరువు పాటకుల కోసం ప్రత్యేకంగా

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలపై దరువు పాటకుల కోసం ప్రత్యేకంగా

ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకరసంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే మార్పు అని అర్థం. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ధనూరాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ.దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తాము. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి గజ గజా వణికిస్తూ వుంటుంది.

ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. “స్వర్గ వాకిళ్లు” అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో “గొబ్బెమ్మలు” పెడతారు. వీధులలో “భోగి మంటలు” వేస్తారు. కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి “సంక్రాంతి లక్ష్మి” ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు.భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని “కలగూర” అంటారు. “నువ్వు పులగం, పొంగలి”, ప్రధాన వంటకాలు.సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు.

 

సంక్రాంతి పండుగ విశిష్టత :

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం.బెల్లం, గుమ్మడి కాయలు “దానమి”స్తారు. పితృదేవతలకు “తర్పణాలు” వదులుతారు.
ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. “రథం” ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడ “గొబ్బెమ్మలు” పెడతారు. బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.

సంక్రాంతి రోజు ఉదయం నువ్వులు, బెల్లం తింటారు. బెల్లం లాగా తియ్యగా మాట్లాడుతూ, సహృదయంతో, పరోపకార బుద్ధితో జీవించాలని అర్థం. నువ్వుల నుండి నూనె వస్తుంది. నూనెకు స్నేహం అనే పేరుంది. స్నేహంగా అందరూ కలిసి మెలిసి జీవించాలని నువ్వులు చెప్తున్నాయి. వైద్యశాస్త్రంలో కూడా చలిని అణచడానికి నువ్వులు, నూనె ప్రయోగం గురించి చెప్పబడింది. సంక్రాంతి సమయంలో ఏయే దానాలు చేస్తారో ఆ వస్తువులన్నీ సూర్యప్రసాదం వల్ల పై జన్మలో లభిస్తాయని నమ్మకం. సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ పండుగ.

 

మూడవ రోజు “కనుమ పండగ”:

ఇది పశువుల పండుగ. మనకు ఎంతో మేలు చేసే పశువులకు కృతజ్ఞతగా పశువుల కొమ్ములకు, బండ్లకు రంగులు వేస్తారు. పశువులను పూజిస్తారు. ఈ రోజును “పశువుల పండుగ” అని కూడ అంటారు. వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు. పశువుల కొట్టంలో “పొంగలి” వండి అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లుతారు. చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.
గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.పూల దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు, రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు. కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు, కోడి పందెములు, గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి సాయంత్రము జరుపుతారు.

“కనుమ” రోజు “మినుము” తినాలని “గారెలు” చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత.మాంసాహారం తినేవాళ్ళు కనుమనాడు తప్పక మాంసం వండుకుంటారు. బొమ్మల కొలువు ఎత్తటం అని పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి ఒక బొమ్మను శాస్త్రార్ధం ఎత్తి పెడతారు. ఈ విధంగా అనాది కాలంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat