విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీవీ9 ఛానల్ నిర్వహించే ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా పోసాని ఇంటికి యాంకర్ వెళ్లాడు. ముందుగా సోసాని ఇంటికి వెళ్లి సార్ ఉన్నాడ అని అడిగి పోసాని ఇంటిలోకి పోతాడు యాంకర్. వెళ్లాగానే బెడ్ మీద లేవలేని కాస్త ఇబ్భంది పడుతూ లేచాడు పోసాని. అప్పుడే అర్థం అవుతుంది బాగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడని .
See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?
అయితే ఇప్పడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ మారింది. ఏమిటంటే..ఇంటర్వూ చూసిన వాళ్లు పోసాని సర్జరీ తరువాత తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటుంటే ఇంటర్వూ చెయ్యడం అంత అవసరమా..అతని ఆరోగ్యం ఏమవ్వాలి..అంటు పోసాని అభిమానులు బండబూతులతో కామెంట్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలుపుకు తన వంతు సాయాన్ని అందించారు. పలుమార్లు జగన్‌తో సమావేశం కావడంతో పాటుగా పాదయాత్రలోనూ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ పలు మీడియా సమావేశాలు నిర్వహించేవారు. ఇప్పుడు ఇలా పోసాని ఆనారోగ్యపాలవ్వడంతో ఇటు సినీ అభిమానులు, అటు వైసీపీ అభిమానులతో పాటు మా దరువు .కామ్ కూడ త్వరగ కోలుకోవాలని కోరుచున్నాము.