సకల దేవతలకు గణాధిపతి…తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు..విఘ్నేశ్వరుడు. అసలు వినాయకుడికి ముందు నుంచి ఏనుగు రూపం లేదు…అందరిలాగే మామూలు రూపంలోనే ఉండేవాడు. పార్వతీదేవీ, పరమేశ్వరుల ముద్దుల తనయుడిగా, లంబోదరుడుగా గజాననుడిగా .భాసిల్లుతున్న వినాయకుడికి ఏనుగు రూపం ఎందుకు వచ్చింది. ? వినాయకుడి జన్మ వృత్తాంతాం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. దీంతో ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరుడినే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు. శివుడు చేసిన పని విని పార్వతీదేవీ ఎంతో దుఃఖించగా, పరమ శివుడు కూడా తన చేసిన తప్పు తెలుసుకుని గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. నాటి నుంచి ‘గజాననుడు’గా పేరు పొందాడు. గణేషుడు జన్మించిన ఆరోజునే వినాయక చవితి పండుగగా జరుపుకుంటున్నాము…వినాయకచవితి నాడు మట్టిగణపతినే పూజించడం శ్రేయస్కమని పండితులు కూడా చెబుతున్నారు. చివరగా మట్టి గణపతే..మహాగణపతి. మట్టి గణపతిని పూజించండి…పర్యావరణాన్ని పరిరిక్షించండి.. . తెలుగు ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలు తొలగించి, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు..!
Tags devotional elephant face festival goddess parvathi lord ganesh Lord shiva secret vinayaka chaviti