నేడు గణపతి నిమజ్జన సందర్భంగా తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే స్వామి వారు కదిలారు. నిన్న అర్ధరాత్రి నుండే భారీ బందోబస్తుతో పోలీసులు దగ్గర ఉండి స్వామి వారి ప్రయాణానికి ఏర్పాటులు చేసారు. మధ్యహ్నం లోపే ఈ మహా గణనాధుడి నిమజ్జనం పూర్తి చెయ్యాలని అధికారులు నిర్ణయించుకున్నారు. దీనివల్ల కొంతవరకు ట్రాఫిక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉదయం మొదలైన ఈ నిమజ్జనాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.
