Home / INTERNATIONAL / ప్రముఖ శృంగార తార మరణం..విషాదంలో అభిమానులు…!

ప్రముఖ శృంగార తార మరణం..విషాదంలో అభిమానులు…!

అమెరికా కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రముఖ శృంగార తార జెస్సీకా జేమ్స్ ఈ రోజు శాన్‌ఫెర్నాండో వ్యాలీలోని తన నివాసంలో హఠాన్మరణం చెందినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల జెస్సీకా జేమ్స్ మోడల్‌గా, పోర్న్ స్టార్‌‌గా పాపులర్ అయింది. ఇవాళ జెస్సీ మరణించిన విషయాన్ని ఆమె స్నేహితుడు వెల్లడించారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక టీఎంజే కథనం ప్రకారం. గత కొద్ది గంటలుగా జెస్సీకా జేమ్స్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కంగారుపడిన ఆమె స్నేహితుడు శాన్ ఫెర్నాండో వ్యాలీలోని ఆమె నివాసానికి వెళ్లగా..ఆమె ఆచేనతంగా కిందపడి కనిపించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించగా జెస్సీకా మరణించినట్లు ప్రకటించారు. ఇంకా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ రావాల్సి ఉంది. కాగా జెస్సీకా జేమ్స్ పూర్తి పేరు జెస్సీకా మైఖేల్ రీడింగ్. పోర్న్ రంగంలోకి అడుగుపెట్టకముందు జెస్సీకా టీచర్‌గా పని చేశారు. నాలుగు, ఐదు, ఆరు తరగతుల విద్యార్థులకు ఆమె లెసన్స్ బోధించేవారు. 21 ఏళ్ల వయసులో బ్రెస్ట్ ప్లాంటేషన్ చేయించుకున్న ఆమె..2002లో పోర్న్ రంగంలోకి అడుగుపెట్టారు. 2005లో హనీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. దాదాపు 200 కు పైగా అడల్ట్ మూవీస్‌లో నటించిన జెస్సీకా..గత కొంత కాలంగా మూర‌్ఛ వ్యాధితో బాధపడుతూ అనేక మందులు వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తంగా పోర్న్ స్టార్‌గా తన అందచందాలతో అమెరికా యువతకు కిర్రెక్కించిన జెస్సీకా జేమ్స్ మరణవార్త ఆమె అభిమానులను షాక్‌‌కు గురి చేసింది.